calender_icon.png 1 December, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయం కృష్ణవేణికే మా మద్దతు

01-12-2025 08:39:26 PM

ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పామార్ బాలాజీ..

చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల మేజర్ పంచాయతీకి పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోయం కృష్ణవేణికి మద్దతు ప్రకటించిన శ్రీ గణేష్ ఆటో యూనియన్ 200 మంది డ్రైవర్లు ఓనర్లు. ఈ సందర్భంగా పామార్ బాలాజీ, మాట్లాడుతూ చర్ల పంచాయతీలో సుమారు 200 మంది ఆటో కార్మికులం గాని ఓనర్లు గాని  ఉన్నామని ఈ 200 కుటుంబాల మద్దతు కూడా సోయం కృష్ణవేణి కి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ప్రెసిడెంట్ పామర్ బాలాజీ  గౌరవ అధ్యక్షులు తెల్ల మల్లాజీ అజయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్లు దాన సరి సంపత్ బాలరాజులు సత్తిరాజు సెక్రటరీ కోడి రెక్కల నాగరాజు ఉప సెక్రటరీ చల్లా అశోక్ కుమార్ యూత్ ప్రెసిడెంట్ జంజీరాల తులసిరామ్ కంచర్ల సతీష్ కోశాధికారి కుక్కడప రాంబాబు స్టీరింగ్ కమిటీ సభ్యులు దొంతు ప్రసాదు సయ్యద్ యాకూబ్ పొగాకు నరసింహారావు చింతల హరిబాబు వేల్పుల శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.