18-10-2025 12:23:07 AM
కరీంనగర్, అక్టోబరు 17 (విజయ క్రాంతి): నగరంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో నర్సరీ నుండి రెండో తరగతి విద్యార్థులచే ఏర్పాటు చేసిన ‘క్రియేటివ్ గెలాక్సీ‘ ప్రదర్శన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డితో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుండి సృజనాత్మకంగా పోటీ తత్వాన్ని పెంపొందించాలని అన్నారు.
విద్యార్థులకు తరగతి గదిలోని విషయాలను చాలా విశ్లేషణాత్మకంగా సమగ్రంగా తెలిపినట్లైతే వారిలో సృజనాత్మకత పెరుగుతుందని, ఆ సుజనాత్మకత ద్వారా నూతన విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే అన్ని విషయాలను పట్ల ప్రత్యక్ష, పరోక్ష విధానాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిలో నేర్చుకునే ప్రక్రియను పెంపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులుపాల్గొన్నారు.