calender_icon.png 18 October, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు బీసీ బంద్ దద్దరిల్లాలి

18-10-2025 12:23:14 AM

పార్లమెంట్‌లో చట్టం చేసే వరకు విశ్రమించం

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి..

24న చలో హైదరాబాద్ 42శాతం రిజర్వేషన్ సాధన సమితి

ముషీరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అ మలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీల బంద్ దద్దరిల్లాలని 42శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి పిలుపునిచ్చింది. శుక్రవారం చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరం జీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారధన్ మహారాజ్, పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబాల నారాయణగౌడ్, ఎస్.దుర్గయ్యగౌడ్, బైరు శేఖర్ తదిత రులు ప్రసంగించారు.

బీసీ రిజర్వేషన్లను సా ధించేందుకు స్వచ్ఛందంగా రాష్ట్ర బంద్‌లో పాల్గొని వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చే యాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పై బిజేపీ, కాంగ్రెస్ ద్వంద వైఖరిని అవంలంబిస్తున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ అంట్టిముట్టనట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈనెల 24న చలో హైదరాబాద్ నిర్వహించి, ఇందిరాపార్కు వద్ద బీసీల మహాధర్నాను చేపట్ట నున్నట్టు తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సం బంధించి పార్లమెంట్లో చట్టం చేసే వరకు విశ్రమించమన్నారు.

వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో చట్టం చేసి, 9వ షె డ్యూల్‌లో చేర్చాలని వారు డిమాండ్ చేశా రు. 60 శాతం ఉన్న బీసీలకు జనాభా దా మాషా ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎ్ర రమాదు వెంకన్న నేత, గడ్డం మీది విజయ్‌కుమార్ గౌడ్, ఒంటెద్దు నరేందర్, పోతగాని ఐలన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.