calender_icon.png 4 September, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయక మండపాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

04-09-2025 05:36:41 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేశుని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) గురువారం రోజున దర్శించుకున్నారు. గణేశుని వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ మండప నిర్వహకులు కలెక్టర్ ను శాలువాతో సన్మానించి, మెమొంటోలను అందజేశారు. పూజారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మల్ పట్టణంలో వినాయక శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. వినాయకుని నిమజ్జనం సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అన్నారు. అనంతరం సమీపంలో గల రాధాకృష్ణ మందిరంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, తాసిల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.