04-09-2025 05:46:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలకు పని భారాన్ని తగ్గించాలని ఎన్సీడీ ఆన్లైన్ సేవలను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గురువారం ఏఎన్ఎంలు నిరసన తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ వద్ద నిరసన తెలిపిన ఎనిమిలు నిరసన తెలిపిన ఆరోగ్య కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు తాము కష్టపడుతున్నప్పటికీ ప్రభుత్వం ఆన్లైన్ సేవలతో పని ఒత్తిడి చేస్తుందని దీనివల్ల మానసిక ఇబ్బందికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో సిసి వినయ్ అందించారు, ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు.