calender_icon.png 7 September, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో వైద్య శిబిరం

04-09-2025 05:34:16 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాత బస్టాండ్ మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాల(Mahatma Jyotiba Phule Residential School)లో జిల్లా వైద్యాధికారులు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గురువారం పాఠశాలలో వైద్య శిబిరం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు, విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో 51 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇందులో 8 మందికి రక్త నమూనాలు ఆడికెట్టుల ద్వారా  పరీక్షించగా ఎలాంటి మలేరియా, డెంగ్యూ పాజిటివ్ లు నిర్ధారణ కాలేదని, అదేవిధంగా 14 మందికి చర్మ సంబంధిత అలర్జీకి సంబంధించిన చికిత్సలు చేయడం జరిగిందని, ముగ్గురిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి పంపించి ఐవీ ఫ్లూట్ ద్వారా చికిత్స అందించడం జరిగిందని వైద్యులు తెలిపారు. పాఠశాలలో డ్రైడేతో పాటు కిచెన్ ను పరిశీలించి, దోమల మందు పిచికారి చేయించారు. 

పాఠశాలలో విద్యార్థినులకు ఎలాంటి సివియర్ కండిషన్స్ తో లేకున్నప్పటికీ వైద్యాధికారులు మూడు రోజుల పాటు వైద్య శిబిరంలు ఏర్పాటు చేయాలని, జిల్లాలోని పీహెచ్సీలలో వైద్యాధికారులందరూ తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రమేష్, డాక్టర్ మానస, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ఆర్బిఎస్కె వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.