01-07-2025 12:39:08 AM
మహబూబాబాద్, జూన్ 30 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యసేవలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు, రికార్డు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. మాతా శిశు సంరక్షణ సేవలందించాలని, నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.
స్టానిక ఎం.ఎల్.హెచ్.పి రికార్డుల నిర్వహణ సరిగా లేదంటూ అసహనం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో పునరావృతం కావొద్దని సూచించారు. గర్బిణి స్త్రీల నమోదును 12 వారాలలోపు గానే పూర్తి చేయాలని, హై రిస్క్ గర్భిణులను ప్రసవం కోసం జిల్లా ఆసుపత్రికి పంపించాలని తెలిపారు. స్థానిక ఆరోగ్య అధికారి డాక్టర్ యమున, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి, కొప్పు ప్రసాద్, స్థానిక ఎంఎల్హెచ్పి, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.