01-07-2025 12:37:32 AM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, జూన్ 30, (విజయ క్రాంతి): ప్రజలు తమ సమస్యలకై ప్రజావాణి లో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, రెవెన్యు అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారీ తో కలిసి గ్రీవెన్స్ లో ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్బంగా కేసముద్రం మండ లం రంగాపురం గ్రామానికి చెందిన లేదల్ల రమాదేవి మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో గల తన తండ్రి పేరు పైన ఉన్న భూమి ఇతరులకు పేరు మార్పిడి ఎలా చేశారని, ఏవిధమైన పత్రాలు సమర్పించారో తెలుపగలరని సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా ప్రజావాణిలో కోరారు.
తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన సరోజన తను గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మడిపల్లి శివారులో ఉన్న భూమి ప్రొహిబిటెడ్ భూమి అని చూపిస్తుందని రికార్డును సరిచేయాలని కోరారు.
జెడ్.పి. సీఈఓ పురుషోత్తం, డి.ఆర్.డి.ఓ మధుసూధనరాజు, హౌసింగ్ డి.ఈ రాజయ్య, ఏ.డి.సర్వే ల్యాoడ్ నరసింహమూర్తి, డి.ఎం.ఇండస్ట్రీ శ్రీమన్నారాయణ, డి.ఎస్.ఓ ప్రేం కుమార్, బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ డెవలప్మెంట్ అధికారులు నరసింహస్వామి, శ్రీనివాసరావు, శ్రీనివాస్, డి.డి. గ్రౌండ్ వాటర్ సురేష్, డి.హెచ్.ఓ మరియన్న, డి.సి.ఓ వెంకటేశ్వర్లు, ట్రైబల్ వేల్ఫేర్ అధికారి దేశీరాం, ఎంప్లాయ్మెంట్ అధికారి రజిత, మత్స్య శాఖ అధికారి వీరన్న, ఎల్.డి.ఎం.సత్యన్నారాయణ మూర్తి, పెన్షన్ అధికారి శంకర్, కలెక్టరేట్ ఏ.ఓ పవన్ కుమార్, సి.సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్, భూభారతి కోఆర్డినేటర్ సురేష్, మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.