26-11-2025 10:51:26 PM
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపకేంద్రంలోని ఓపి రికార్డును మెడిసిన్ స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. అనంతరం అక్కడ రోగులతో మాట్లాడుతూ ఆరోగ్య సేవలు నిత్యం సవ్యంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది నిత్యం సకాలంలో విధులకు హాజరై రోగులకు సేవలు అందించాలన్నారు. బీపీ, షుగర్ పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తూ వాటికి సంబంధించిన మందులను పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వెలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఉబ్బు నరసింహ, కేంద్ర నిర్వాహకులు హేమలత, మల్లేశ్వరి పాల్గొన్నారు.