29-08-2025 08:20:16 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు, రికార్డుల పరిశీలన, ఫార్మసీ (మందులు) కుక్క కాటు ఇంజక్షన్లు, పాముకాటు ఇంజక్షన్లు, నిల్వ ఉన్నవా లేవా అని పరిశీలించారు. ఓపి విభాగాల్లో ఏ రకాల వ్యాధుల వారు ఆసుపత్రికి వస్తున్నారని, రికార్డులు పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ వర్షకాలంలో ఎక్కువ వర్షాలు కురుస్తున్నందున వాగులకు వరదలు ఎక్కువ రావడం జరుగుతుందని, రోడ్లు వంతెనలు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, ముందుగానే గర్భిణీ స్త్రీలను 15 రోజుల లోపు డెలివరీ కున్న గర్భిణీ స్త్రీలను మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి లేదా జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రానికి తరలించాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలం దుష్ట గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
నీటి నిలువలు లేకుండా చేయాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, లాంటి వ్యాధులకు ప్రజలు గురవుతున్నారని,గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా పలిమెల మండల కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు ఏ స్థాయి వరకు జరిగినవి పరిశీలించారు. పంకేన గ్రామంలోని ఆయు ష్మాన్ ఆరోగ్య కేంద్రాంను సందర్శించి ప్రజలకు అందించే సేవల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.