calender_icon.png 29 August, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు యోగ్యత పత్రాల ప్రధానం

29-08-2025 08:16:06 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): నవ లిమిటెడ్ పాల్వంచ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నవ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు   ఫిట్టర్, ఎలక్ట్రికల్ కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం యోగ్యత పత్రాలను జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి కే సంజీవరావు ప్రధానం చేశారు.

ఎలక్ట్రికల్ లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థి డి. వంశీకృష్ణ మాట్లాడుతూ... నాకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడిందని శిక్షణా నంతరం స్నైడర్ ఎలక్ట్రికల్ ఇండియా కంపెనీలో నెలకు రూ 12 వేల వేతనంతో ఉద్యోగం లభించిందన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన  చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కే. సంజీవరావు మాట్లాడుతూ నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు గొప్ప వరమని ఈ అవకాశం ఉపయోగించుకొని భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలని కోరారు.

 నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ సిఎస్ఆర్ ఎంజి ఎం ప్రసాద్ మాట్లాడుతూ... ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇప్పటివరకు 1711 మందికి పైగా వివిధ కోర్సులు శిక్షణ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. వీరికి సింగరేణి, కేటీపీఎస్ ,బీహెచ్ఈఎల్ వంటి ప్రముఖ సంస్థలలోనూ అలాగే కిర్బీబిల్డింగ్స్, ఎంటార్, హెరిటేజ్ మొదలైన ప్రైవేట్ సంస్థలలో కూడా ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు.