calender_icon.png 15 September, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యమా

15-09-2025 07:25:26 PM

జిల్లా వాహనదారుల ఆవేదన..

జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో జనగామ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిలో సురక్ష హాస్పిటల్, సమీపంలో నిత్యం ప్రజలు ప్రయాణించే రోడ్డు మార్గంలో, డివైడర్ వర్క్ జరుగుతున్న సమయంలో భారీ గుంత తీసి అసంపూర్తిగా పూర్తిచేసి వదిలివేయడం జరిగింది. దీనివలన జిల్లా కేంద్రంలో హైదరాబాద్ ప్రధాన రహదారి మరియు నిత్యం జనావాసాలు, తిరిగే ప్రదేశం కాబట్టి డివైడర్ చూడకుండా సడన్గా వాహనదారులు యూటర్న్ తీసుకుంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు రోడ్డు, భవనాలు రహదారుల శాఖ, మున్సిపల్ శాఖ, కనీసం పోలీస్ శాఖ అయిన ఎటువంటి హెచ్చరిక గుర్తులను ఏర్పరచలేదు, ప్రజల ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యం, ఎందుకని వాహనదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులపై వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకొని డివైడర్ వర్క్ ను ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే త్వరితగతిన పూర్తి చేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.