15-09-2025 08:58:06 PM
గారకుంట తండా గ్రామస్తుల వినతి
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలోని గారకుంట తండా గ్రామానికి నూతన రేషన్ దుకాణాన్ని మంజూరు చేయాలంటూ సోమవారం హుజూర్‌నగర్ ఆర్డిఓ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.గార కుంట తండా గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీ అయినప్పటికీ ఇప్పటివరకు రేషన్ దుకాణం మంజూరు కాలేదని గ్రామానికి చెందిన బానోతు రమేష్ నాయక్, గుగులోతు బాలకృష్ణలు తెలిపారు. గ్రామంలో 350కు పైగా రేషన్ కార్డులు ఉన్నాయని సుమారు 2000 మంది జనాభా కలిగి ఉన్న గ్రామపంచాయతీకి రేషన్ షాపు లేకపోవడం బాధాకరమని తెలిపారు.
ప్రస్తుతం పరెడ్డిగూడెం గ్రామంలో ఉన్న రేషన్ షాపుకు వెళ్లి గ్రామస్తులు బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.గారకుంట తండా గ్రామం నుంచి పర్రెడ్డిగూడెం గ్రామానికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం లేదని దీంతో రేషన్ సరుకుల కోసం గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.గిరిజనుల పరిస్థితులను అర్థం చేసుకొని అధికారులు వెంటనే రేషన్ షాప్ మంజూరు చేయాల్సిందిగా వారు కోరారు.