15-09-2025 08:49:36 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలో మంగళవారం స్వర్గీయ సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభను నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు తెలిపారు. గరిడేపల్లి లో ఆయన సోమవారం మాట్లాడుతూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని కాశీనాదం ఫంక్షన్ హాల్ లో సురవరం సంతాప సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు సిపిఐ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సంతాప సభకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.
సురవరం సుధాకర్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీకి చేసిన సేవలు త్యాగాలు మరువలేనివని ఆయన తెలిపారు. ఈ సంతాప సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మాత్యులు కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి,సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్ల వెంకటరెడ్డి,కోదాడ శాసనసభ్యులు ఉత్తం పద్మావతి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, కన్నా చంద్రశేఖర్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం లాంటి పెద్దలు పాల్గొంటున్నారని పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతాప సభను దిగ్విజయం చేయాలని ఆయన కోరారు.