15-09-2025 08:36:07 PM
పటాన్ చెరు,(విజయక్రాంతి): ముంబై భివండిలో బ్రేవ్ యూత్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఆదివారం చీఫ్ ఆర్గనైజర్ రాజా రామ్ దేవసాని, అశోక్ దేవసాని ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణానికి చెందిన లక్ష్యం చోటు ఖాన్ కరాటే అకాడమీ ఫౌండర్ మాస్టర్ అనిల్ లో శిక్షణ పొందుతున్న హాసిని బ్లాక్ బెల్ట్ బాలికల విభాగంలో గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. జాతీయస్థాయి గ్రాండ్ ఛాంపియన్షిప్ సాధించిన హాసినికి లెజెండ్రీ గ్రాండ్ మాస్టర్ వీరాచారి, నాగేష్ మల్లూరి, బాల ప్రసాద్ నిజ, మాస్టర్ కేశవ్ గౌడ్, కోచ్ అనిల్ యాదవ్ లు హాసినికి గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని అందజేసి అభినందించారు.