calender_icon.png 15 September, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

15-09-2025 07:25:38 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి):  మండలంలోని హన్మంతుపల్లి గ్రామానికి చెందిన జెడ కిష్టయ్య (36) అనే వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై గోపతి సురేష్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వ్యవసాయ భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు. తను పంటల కోసం మందులను కొనుగోలు చేసాడు. మందులు కొనుగోలు పంటకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా ఎందుకు తెచ్చావని తన రెండవ భార్య లక్ష్మి అడగగా అప్పటికే మద్యం సేవించి ఉన్న మృతునికి రెండవ భార్యతో మాటామాట పెరిగి గొడవ పడ్డారన్నారు.

భార్య లక్ష్మి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చే సరికి వాంతులు చేసుకోవడం గమనించి అడగగా పంటకు కొట్టే పురుగుల మందు రాత్రి తాగానని చెప్పగా  లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. మృతుని అన్న జెడ లచ్చన్న పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.