calender_icon.png 15 September, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటిడిఏ పిఓను మర్యాదపూర్వకంగా కలిసిన దేవస్థానం ఈవో దామోదర్ రావు

15-09-2025 08:30:30 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం  శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్ రావు భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ను ఐటిడిఏ కార్యాలయంలోని పిఓ  చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అర్చక స్వామికే ఆశీర్వచనాలు ఇచ్చి స్వామివారి ప్రసాదం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నాడు ఐటీడీఏ కార్యాలయంలోని పి ఓ ఛాంబర్ లో పిఓను  కలిసి సీతారామచంద్ర స్వామి దేవస్థానం నకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించాలని ఈఓకి సూచిస్తూ పిఓ శుభాకాంక్షలుతెలిపారు.