calender_icon.png 15 September, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గట్లమల్యాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

15-09-2025 08:45:10 PM

నంగునూరు: నంగునూరు మండలంలోని గట్లమల్యాల జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 2010-2011 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. సుమారు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకచోట కలుసుకున్న సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకున్నారు. పూర్వ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ... ఈ పునఃకలయిక మధురానుభూతిని కలిగించిందని ప్రశంసించారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల పట్ల చూపిన గౌరవానికి చిహ్నంగా, వారికి శాలువాలతో సత్కారం చేశారు. ఈ సందర్భంగా వారు పాత మిత్రులను కలిసి, ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు.