calender_icon.png 25 September, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు న్యాయానిర్ణేతలుగా జిల్లా రెఫరీలు

25-09-2025 08:30:03 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఈనెల 26 నుంచి 29 వరకు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పట్టణంలోనీ నిజం కళాశాలలో జరిగే 17వ హెచ్ఎఫ్ఐ  మినీ బాల బాలికల హ్యండ్ బాల్ పోటీలకు రెఫరీగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సునర్కార్ అరవింద్, దుర్గం రాజలింగు, గోగర్ల రాజశేఖర్, గోగర్ల సాయి ఎంపికైన వీరందరూ గతంలో కూడా అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించరని అంతేకాక దేశంలోని అత్యున్నత క్రీడా శిక్షణ సంస్థ అయిన నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (NSNIS) పటియాలలో క్రీడా శిక్షణ శిక్షకులుగా శిక్షణను పూర్తి చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అధ్యక్షుడు గొనె శ్యామ్ సుందర్ రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు. కళ్యాణ్ ఎంపిక పట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కోశాధికారి అలుగువెల్లి రమేష్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పిన్నింటి  రఘునాథ్ రెడ్డి, అసిఫాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఇన్చార్జ్ ప్రెసిడెంట్ అరిగెల మల్లికార్జున యాదవ్, DD TW & DYSO రమాదేవి, కోచ్ లతో పాటు పలువురు అధికారులు అభినందించారు.