calender_icon.png 25 September, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

25-09-2025 08:50:02 PM

పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్  గౌడ్ 

పాపన్నపేట: మంజీరా నదికి భారీ వరదలు వస్తున్నందునా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్టు నుంచి 80వేల క్యూసెక్కుల మేర దిగువకు నీటిని విడుదల చేయడంతో మంజీరా ఉద్ధృతంగా ప్రవహిస్తుందన్నారు.

మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు నదికి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నందున రైతులు, మత్స్యకారులు, పశుకాపరులు నదిలోకి వెళ్ళవద్దని సూచించారు. వనదుర్గా ప్రాజెక్టు వద్ద వరద తీవ్రంగా ఉన్నందున ఏడుపాయలకు వచ్చే భక్తులు అటువైపు వెళ్ళవద్దని సూచించారు. వర్షాలకు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే పాపన్నపేట ఎస్సై నెంబర్ 87126 57920 కు సంప్రదించాలని తెలిపారు.