calender_icon.png 25 September, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్పిఐ(ఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుపతి

25-09-2025 08:12:24 PM

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన గుడికందుల  తిరుపతిని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్బీఐ(ఎ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు పసుల రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తిరుపతిని జిల్లా అధ్యక్షులు ఎండి రహమత్ ఖాన్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ... తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.