25-09-2025 09:03:05 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): వాగులు, ఓర్రెలు, ఉప్పొంగిన సమయంలో ఎవరు కూడా దాటే ప్రయత్నాలు చేయకూడదని తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు. బెజ్జూర్ మండలంలోని సుస్మిర్ ఒర్రెను అధికారులతో కలిసి పరిశీలించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వాగులు ఓర్రెలు ఉప్పొంగిన సమయంలో గిరిజన గ్రామాల ప్రజలు ఎవరు కూడా దాటే ప్రయత్నాలు చేయకూడదని గ్రామాల ప్రజలకు సూచించారు. ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసిన సమయంలో చెట్ల కింద కానీ,ఎత్తైన ప్రదేశాల్లో ఉండకూడదని పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో మండల అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. వారి వెంట గ్రామ కార్యదర్శి రోజా, కరోబార్ సుధాకర్ తదితరులు ఉన్నారు.