calender_icon.png 25 September, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

25-09-2025 08:23:35 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): స్వతంత్ర ఉద్యమకారుడు, పీడిత ప్రజల విముక్తికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 110 జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించుకోవాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాలలో బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రభుత్వం బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని పద్మశాలీలు శుక్రవారం ఉదయం 11 గంటలకి కలెక్టరేట్ కి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. జయంతి వేడుకలలో తెలంగాణ వాదులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల,ప్రజా, కుల సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు.