25-09-2025 08:57:59 PM
గుండాల,(విజయక్రాంతి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛతహి సేవ కార్యక్రమంలో భాగంగా మండల అధికారులు చీపురు పట్టారు. రోడ్లు ఊడ్చి చెత్తను తొలగించారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఎంపీడీవో దేవేందర్ రావు పిలుపునిచ్చారు. గురువారం ఎంపీవో సలీం పంచాయతీ కార్యదర్శులు మునావర్, సైదులు ఈజీఎస్ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్ స్వచ్ఛత కార్యక్రమంలో శ్రమదానం చేశారు.