25-09-2025 08:54:43 PM
గుండాల,(విజయక్రాంతి): గుండాల పీహెచ్సీలో స్వస్థ నారి సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని గురువారం మెడికల్ ఆఫీసర్ డా ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న 150 మంది మండల ప్రజలు ఈ క్యాంపులో పాల్గొన్నారు. ప్రత్యేక వైద్యా ధికారులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలు, దంత సమస్యలు, కంటి సమస్యలు, చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలపై వైద్యులు పరీక్షలు నిర్వహించారు.