calender_icon.png 30 July, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ములుగు జిల్లా ఎస్పీ డా.శబరిష్.పి

29-07-2025 11:14:12 PM

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ఎస్పీ డా.శబరిష్(District SP Dr. Shabarish) నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్, సస్పెక్ట్ షీటర్స్ గురించి ఆరా తీసి, వారిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలని, వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా కోర్టులో ట్రయల్ లో ఉన్న కేసుల గురించి ఆరా తీసి, ప్రతికేసులోను తప్పనిసరిగా సాక్షులకు, ముద్దాయిలకు సమన్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. నేరస్తులకు శిక్ష పడే విధంగా కోర్టు కానిస్టేబుల్ లు విధులు నిర్వహించాలని, అంతిమంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెలలో నమోదైన కేసుల వివరాలపై పోలీస్ స్టేషన్ ల వారీగా ఆరా తీసి, కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రతి కేసులోనూ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఫైల్ అప్డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దొంగతనాలు, ఆర్థిక నేరాలలో ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా దర్యాప్తును ముమ్మరం చేయాలని, పోగొట్టుకున్న నగదు లేదా వస్తువులను బాధితులకు అప్పగించేలా కృషి చేయాలి అని ఆదేశించారు. పాత కేసుల దర్యాప్తులో పురోగతిని పరిశీలించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటుపై ప్రజలలో అవగాహన తీసుకొని వచ్చి కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచనలు చేశారు.రోడ్డు ప్రమాదాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. మహిళలపై జరిగే నేరాలలో వీలైనంత త్వరగా విచారణ చేసి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు.యువత ఆన్లైన్ బెట్టింగ్ వలలో పడి మోసపోకుండా పోలీస్ స్టేషన్ ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ ని ప్రోత్సహిస్తే వల్ల పైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారి చేశారు. యువత, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా సైబర్ క్రైమ్ నేరాలపై ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదేశించారు.