29-07-2025 11:10:26 PM
గ్రామపంచాయతీలలో సమస్యలు, తలెత్తకుండా కార్యదర్శులు కృషి చేయాలి..
డిఎల్పిఓ సురేందర్..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): గ్రామపంచాయతీలలో అభివృద్ధి మన లక్ష్యంగా, గ్రామ ప్రజలకు సమస్యలు తలెత్తకుండా వీధిలో నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలని డిఎల్పిఓ సురేందర్(DLPO Surender) అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో ఎల్లారెడ్డి మండల పరిషత్ అధికారి ప్రకాష్ ఆధ్వర్యంలో మండలంలోని 31 గ్రామపంచాయతీల కార్యదర్శులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించి విధుల్లో నిర్లక్ష్యం వహించాలని తెలిపారు. అభివృద్ధి మన లక్ష్యంగా కొనసాగాలని మండల పరిషత్ అధికారి ప్రకాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి ప్రకాష్ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.