29-07-2025 11:17:35 PM
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): తెలంగాణ కవి సాహితీవేత్త స్వర్గీయ సి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఘనమైన నివాళులు అర్పించారు. అంతకుముందు సినారె సాహితీ సేవలను స్మరించుకుంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేటీఆర్ ఘనమైన నివాళిని నడిపిస్తూ ఒక పోస్ట్ చేశారు.
కవితలు, పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, గజల్‌లు, వ్యాసాలు, సినిమా పాటలు... రూపం ఏదైనా సినారె కలానికి తిరుగులేదు. కవి, సాహితీవేత్త, పరిశోధకుడు, అధ్యాపకుడు, సినీ గేయ రచయిత. పాత్ర ఏదైనా సినారె ప్రతిభకు సాటిలేదు, ప్రపంచ సాహితీ లోకానికి మన తెలంగాణ గడ్డ అందించిన ఆణిముత్యం సింగిరెడ్డి నారాయణ రెడ్డి తన పాండిత్యంతో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన సినారె.. తెలుగు సాహితీ వినీలాకాశంలో ఒక ధృవతార తన రచనలతో తెలుగు చలనచిత్ర రంగంలో సరికొత్త బాణీని సృష్టించిన సినారె పాటల పూదోట జ్ఞానపీఠ్ అవార్డుతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వారిని వరించినా, రాజ్యసభ ఎంపీతో పాటు ఎన్నో గొప్ప పదవులను అలకరించినా.. ఇవన్నీ సినారె సాహితీ సేవ ముందు దిగదుడుపే సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా అక్షర నివాళులు.