8 August, 2026 | 1:17 AM

కూచారంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్‌పీ

08-08-2026 12:03 AM

మనోహరాబాద్, ఆగస్ట్ 7 (విజయక్రాంతి) : మనోహరాబాద్ మండలంలోని కుచారం గ్రామంలో సిసి కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు హాజరై ప్రారంభించారు. మనోహరాబాద్ ప్రాంతంలోని ఐటిసి కంపెనీ వారు సీసీ కెమెరాలను కూచారం గ్రామ సంక్షేమం కోసం ప్రధానం చేయడం జరిగిందనీ ముఖ్యంగా ఐటిసి కంపెనీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, రాత్రుల్లో అరాచక శక్తులు ప్రదర్శించే ప్రతి ప్రక్రియను సీసీ కెమెరాల్లో రికార్డు కావడం జరుగుతుందని అన్నారు. వీటి ద్వారా ముష్కరులను అతి సులభంగా పట్టుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

గ్రామంలోనే కాకుండా ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరాలు బిగించుకోవాలని పేర్కొన్నారు. గ్రామంలో యువత గాంజాకు అలవాటు పడకుండా ప్రతి ఒక్కరు భద్రతను పెంపొందించుకోవాలని, ముఖ్యంగా గంజాయి అమ్మకాలు జరిగితే తక్షణమే పోలీసులకు టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1908, 1930 ద్వారా సమాచారం అందించాలని అన్నారు.

అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల గురించి నిక్షిప్తంగా వివరిస్తూ ఒక కుటుంబంలో ఒక యజమాని చనిపోతే ఆ ఇంటి పరిస్థితి ఏ విధంగా తయారవుతుందో ఊహించుకోలేమన్నారు,  ఇందులో తూప్రాన్ డి ఎస్ పి నరేందర్ గౌడ్, స్పెషల్ బ్రాంచ్ సందీప్ రెడ్డి, సిఐ వెంకట రాజా గౌడ్, ఎస్త్స్ర సుభాష్ గౌడ్, ఐటీసీ కంపెనీ అధికార యంత్రాంగం, గ్రామ సర్పంచ్ చిత్ర రఘు, గ్రామ సెక్రెటరీ, పాలకవర్గం సభ్యులు, గ్రామ యువత, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.