27 April, 2026 | 1:48 AM

జనగణన స్వీయ గణన పూర్తి చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

27-04-2026 12:00 AM

సిరిసిల్ల, ఏప్రిల్ 26, (విజయక్రాంతి): జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఆది వారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియలో పాల్గొని తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ ప్రజలు అందరూ జనగణనలో భా గంగా తమ కుటుంబ సభ్యుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరి సహకారం అత్యంత కీలకమని తెలిపారు. సరైన సమాచారం అందించడం ద్వారా సమగ్ర గణాంకాలు సిద్ధమవుతాయని పే ర్కొన్నారు.జనగణన విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు చురుకుగా పాల్గొని బాధ్యతగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.