13-11-2025 10:54:07 PM
సిద్దిపేట: తెలంగాణ సాహిత్య పరిషత్ హైదరాబాద్ వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన వచన కవితా పోటీ విభాగంలో నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని మొగుళ్ల శ్రీహిత ప్రోత్సాహక బహుమతిని అందుకుంది. ఈ విజయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరీ మోహన్ ప్రకటిస్తూ, విద్యార్థిని ప్రోత్సహించిన తెలుగు ఉపాధ్యాయులు మహేంద్రా రెడ్డితో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థినిని అభినందించారు. శ్రీహితను నవంబర్ 23వ తేదీన హైదరాబాద్‌లో తెలంగాణ సాహిత్య పరిషత్ నిర్వహించే కార్యక్రమంలో నగదు బహుమతి, మేమెంటోతో సత్కరించనున్నారు.