calender_icon.png 14 November, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు

13-11-2025 11:12:32 PM

బేగంపేటలో నూతన ఐకెపి కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

రామగిరి (విజయక్రాంతి): రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మండలంలోని బేగంపేట గ్రామంలో స్వర్గీయ శ్రీపాదరావు స్మారకంగా నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో వారు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకొని లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీఓ సురేష్, తాసిల్దార్ సుమన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ ‌సీనియర్ నాయకుడు శివ తదితరులు పాల్గొన్నారు.