calender_icon.png 13 November, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్య కార్మికుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

13-11-2025 10:50:35 PM

గరిడేపల్లి (విజయక్రాంతి): మత్స్య కార్మికుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మండల పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి అన్నారు. మండలంలోని రాయని గూడెం సూరల దేవి చెరువులో గురువారం 100% సబ్సిడీతో ప్రభుత్వం అందించిన చేప పిల్లలను ఆయన వదిలారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్య కార్మికుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిందని ఆయన తెలిపారు. దీనిలో భాగంగానే మండలంలోని అన్ని చెరువుల్లో సబ్సిడీతో ప్రభుత్వం చేప పిల్లలను అందజేస్తుందని తెలిపారు.

మత్స్య కార్మికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చేప పిల్లల అభివృద్ధి కోసం కృషి చేయాలని తద్వారా వారి కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు రామాంజిగౌడ్, మాజీ ఎంపీటీసీ బాల్ దూరి సందీప్, మైనారిటీ సంఘం నాయకులు చాంద్ మియా, మండల వ్యవసాయ అధికారి ప్రియతమ కుమార్, ఎంపీ ఓ ఇబ్రహీం, కార్యదర్శి సునీత, చెరువు సంఘం సొసైటీ చైర్మన్ వాడపల్లి నరసయ్య, మాజీ సర్పంచ్ దేవదానం, అశోక్, ప్రసాద్, గ్రామపంచాయతీ సిబ్బంది కొండ సైదులు, విశాఖ తదితరులు పాల్గొన్నారు.