calender_icon.png 14 November, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత

13-11-2025 10:57:00 PM

పాఠశాలకు చేయూతనందించిన పూర్వ విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు 

గరిడేపల్లి (విజయక్రాంతి): మండల పరిధిలోని కల్మలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఇనుప బీరువాను బహుకరించారు. 1984-85 10వ తరగతి పూర్వ విద్యార్థులు గురువారం14 వేల రూపాయల విలువగల ఇనుప బీరువాను పాఠశాలకు అందజేశారు. వారం రోజుల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో పాఠశాలకు ఉపయోగపడే సహాయాన్ని అందించాలని నిర్ణయించారు.

దీనిలో భాగంగా పాఠశాలకు అవసరమైన డబల్ డోర్ ఇనుప బీరువాను బహకరించినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిడమర్తి వీరబాబు అభినందించారు. కార్యక్రమంలో  పూర్వ విద్యార్థులు కంబాలపల్లి వెంకటనారాయణ,ఎడవల్లి వెంకటరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తొగర్ వెంకటేశ్వర్లు,జొన్నలగడ్డ రవి,వెంకట్ రెడ్డి,జగన్,పుష్పలత,విజయ కుమారి,నాగయ్య,సైదిరెడ్డి,ఎల్లయ్య,జ్యోతి,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.