calender_icon.png 14 November, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులకు బర్ల వెంకటేశ్వర్లు అందించిన సేవలు అభినందనీయం

13-11-2025 11:15:36 PM

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్..

కార్మికుల సమక్షంలో ఘనంగా రిటైర్మెంట్ వేడుకలు..

బూర్గంపాడు (విజయక్రాంతి): లక్ష్మీపురంలో గల ఫిమాకెమ్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీ నందు గత 27 సంవత్సరాలుగా కార్మికునిగా బర్ల వెంకటేశ్వర్లు అందించిన సేవలు అభినందనీయమని ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ అన్నారు. గురువారం లక్ష్మీపురం గ్రామంలోని ఫిమాకెమ్ ఇండియా లిమిటెడ్ నందు గత 27 సంవత్సరాలుగా కార్మికుడిగా, నేడు హై స్కిడ్ కార్మికుడిగా పని చేసిన బర్ల వెంకటేశ్వర్లు రిటైర్మెంట్ వేడుకలను కార్మికుల సమక్షంలో ఫ్యాక్టరీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1999 ఫిబ్రవరి నుంచి కార్మికుడిగా విధులలో చేరి, కార్మికుల కొరకై అందరినీ కలుపుకొని ఫ్యాక్టరీలో ఏబటియుసి యూనియన్ ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

సమిష్టి నిర్ణయాలతో యూనియన్ బాగోగులను చూసి నేడు హై స్కిల్ కార్మికుడిగా అంచలంచలు ఎదిగి, ఫ్యాక్టరీ ఎదుగుదలలో తన వంతు కృషి చేసి నేడు రిటైర్డ్ అవుతున్న బర్ల వెంకటేశ్వర్లుకు కార్మికులు అంతా సంతోషంగా పదవీ విరమణ వీడ్కోలు తెలపడం హర్షనీయమని అన్నారు. అనంతరం ఫిమాకెం ఇండియా లిమిటెడ్ జీఎం రఘు మాట్లాడుతూ కార్మికులకు సేవలను అందించడంతో బర్ల వెంకటేశ్వర్లు ఎప్పుడు ముందు ఉండేవారని తెలిపారు. తన పదవి విరమణ జీవితం కుటుంబంతో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు మల్లికార్జున్, గడ్డం వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు, పేరాల శ్రీనివాసరావు, అలవాల సీతారాంరెడ్డి, సుబ్బారెడ్డి, నాగరాజ్, తోకల శ్రీను, యూనియన్ నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, అప్పారావు, చందర్రావు, లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.