calender_icon.png 14 November, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేలిన గ్యాస్ సిలిండర్

13-11-2025 11:04:01 PM

- చైతన్యపురిలో ఘటన... తీవ్రంగా గాయపడ్డిన మహిళ

- ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా అనుమానాలు 

ఎల్బీనగర్: చైతన్యపురి పరిధిలోని ద్వారకాపురి కాలనీలో గురువారం ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాలు... యాదాద్రి భువనగిరి జిల్లా వీరపల్లి గ్రామానికి చెందిన ప్రతిభను 2010లో అదే జిల్లాకు చెందిన గొల్లపల్లి గ్రామానికి చెందిన వంటేరు ప్రవీణ్‌తో వివాహం జరిగింది. వీరు హైదరాబాద్ లోని చైతన్యపురి డివిజన్ ద్వారకాపురి కాలనీ రోడ్ నెంబర్ 3లో నివాసం ఉంటున్నారు. వీరికి 8వ తరగతి చదువుతున్న కుమార్తె(13) ఉన్నది. అయితే, గురువారం గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా బెడ్ రూమ్ లో మంటలు చెలరేగాయి.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రతిభ తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 90% కంటే ఎక్కువ కాలిన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ప్రతిభా గతంలో కూడా లైజాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. అగ్ని ప్రమాద ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.‌ దర్యాప్తు అనంతరం పూర్తి స్థాయిలో వివరాలు తెలుస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, బాధితురాలు ఆత్మహత్య చేసుకోవడానికే గ్యాస్ సిలిండర్ లీక్ చేసుకున్నట్లు భావిస్తున్నారు.