calender_icon.png 14 November, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతో పాటు క్రీడా స్ఫూర్తి చాటాలి

13-11-2025 11:26:05 PM

కొండపల్లి శ్రీధర్

మంచి కంటి నగర్ లో పిల్లల జాతర 

ప్రారంభమైన క్రీడా పోటీలు 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): విద్యార్థులు, యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించి, దేశ పౌరులుగా తీర్చిదిద్దబడాలని సిపిఎం అనుబంధ తెలంగాణ బాలోత్సవ్ పిల్లల జాతర ఇంచార్జ్ కొండపల్లి శ్రీధర్ అన్నారు. తెలంగాణ బాలోత్సవం సందర్భంగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం పిల్లల క్రీడా పోటీలు ప్రారంభించారు. మంచికంటి నగర్, పాలకోయతండా విద్యార్థులు పలు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. నవంబర్ 14 చాచా నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని క్రీడ పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు.

జన విజ్ఞాన నాయకురాలు కస్తూరి మాట్లాడుతూ.. క్రీడల్లో సత్తా ఉన్నప్పటికీ.. ప్రోత్సాహం కరువైన నేపథ్యంలో యువత రాణించలేకపోతుందని ఆరోపించారు. ప్రోత్సహించి, శిక్షణ ఇస్తే.. దేశం గర్వించదగ్గ క్రీడాకారులవుతారని పేర్కొన్నారు. బాలల దినోత్సవం స్ఫూర్తితో ప్రతిభా పాటవాలు పెంపొందించుకోవాలని పిలుపు నిచ్చారు. తొలి రోజు క్రీడలు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. శుక్రవారం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పొదిల తులసిరామ్, నిరంజన్, భాష నారాయణ, సోమలింగం, యాకూబ్, కొండపల్లి క్రాంతి కుమార్, కొండపల్లి సీతారాం, భూక్య కవిత, సున్నం కవిత, స్థానికులు పాల్గొన్నారు.