13-11-2025 11:21:28 PM
లాంఛనంగా ప్రారంభించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం నియోజకవర్గం చర్ల మండల కేంద్రం నుండి రాజమండ్రి వరకు నూతన బస్సు సర్వీసును భద్రాచలం డిపో ఆర్టీసీ అధికారులు గురువారం ప్రారంభించారు. భద్రాచలం డిపో నుండి బయలుదేరే బస్సును భద్రాచలం వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య లాంచనంగా ప్రారంభించారు. భద్రాచలం డిపో నుండి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి 4.20 గంటలకు చర్ల చేరుకుంటుంది. చర్ల నుండి నుండి సాయంత్రం 4. 40 నిమిషాలకు బయలుదేరి భద్రాచలం, బూర్గంపహాడ్, కుక్కునూరు మీదుగా రాజమండ్రికి రాత్రి 10.30 గంటలకు చేరుకుంటుందని డిపో మేనేజర్ జంగయ్య తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చర్ల మండలం ప్రజలు దుమ్ముగూడెం మండల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రారంభ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.