కస్తూరిబా గాంధీ పాఠశాలలో మొక్కలు నాటిన జిల్లా సంక్షేమ అధికారిణి
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కాటారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో నాశ ముక్త్ భారత్ వారం రోజులు జరిగే కార్యక్రమంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారిని మల్లేశ్వరి(District Welfare Officer Malleswari) పాల్గొన్నారు. మల్లేశ్వరి మాట్లాడుతూ... విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా మా శాఖ పని చేస్తుందని తెలిపారు.
అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, నాశ ముక్త్ భారత్ లక్ష్యాలపై విలువైన సందేశాన్ని అందించారు. మత్తుకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణకి కట్టుబడి ఉండాలని, విద్యార్థులకు మత్తుపదార్థాల దుష్పరిణామాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సిడిపిఓ రాధిక, కేజీబీవీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.






