calender_icon.png 10 October, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌టీఐ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించినందుకు జిల్లాకు దక్కిన అవార్డు

10-10-2025 01:22:53 AM

రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ నుంచి అవార్డు అందుకున్న కలెక్టర్ 

జనగామ, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : సమాచార హక్కు చట్టం  వారోత్సవాలు గురువారం హైదరాబాదు లోని రవీంద్రభారతి లో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్,  బెస్ట్ పి ఐ ఓ ,బెస్ట్  డిపార్ట్మెంట్ ఇన్ డిస్పోజల్ ఆఫ్ ఆర్టిఐ కేసెస్  మొదలగు ఏడు విభాగాల్లో పురస్కారాలను, ప్రధానం చేశారు.

ఈ క్రమం లో గవర్నర్ విష్ణు దేవ్ శర్మ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అవార్డు ను అందుకున్నారు. ఆర్టిఐ దరఖాస్తు లను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ. పెండింగ్ లేకుండ, వ్యవహారిస్తున్నందుకు గాను బెస్ట్ పెర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ , గా జనగాం జిల్లా ఎంపీక అయిన సందర్బంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ అవార్డు ను తీసుకున్నారు.

జిల్లా కి వివిధ అంశాల్లో  అనేక  అవార్డు లు వస్తున్నందుకు, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్  దిశా నిర్దేశం లో వివిధ శాఖల అధికారులు గా పని చేయడం. గర్వం గా ఉందని, అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికప్పుడు ఆర్టిఐ దరఖాస్తు లను త్వరగా పరిష్కరించాలని. పౌరులు, అడిగిన సమాచారాన్ని  గడువు లోపల ఇస్తున్నారా. లేదా అని కలెక్టర్ రివ్యూ చేసేవారని. ఈ సందర్బంగా అధికారులు తెలిపారు.