102, 108 అంబులెన్స్ అధికారులతో డీఎంఅండ్‌హెచ్‌ఓ సమావేశం
కొత్తగూడెం, మార్చి 4, (విజయక్రాంతి): జిల్లా కార్యాలయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్, జిల్లాలోని 102, 108 అంబులెన్స్ వాహనాల కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో 102, 108 అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించే విషయంలో, ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
గ్రామీణ మరియు దూర ప్రాంతాల్లో కూడా వాహనాలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆయా పరిధిలో అంబులెన్స్ వాహనాలను సిద్ధంగా ఉంచి గర్భిణీలు, బాలింతలు, ఇతర అత్యవసర రోగులకు తక్షణ సేవలు అందేలా, కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 102, 108 జిల్లా కోఆర్డినేటర్లు డిపిఎంవోమోహన్ తదితరులు పాల్గొన్నారు.




