17-12-2025 12:00:00 AM
పెద్దపల్లి డీసీపీ బి, రాంరెడ్డి
సుల్తానాబాద్, డిసెంబర్ 16 (విజయ క్రాంతి): పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లను తప్ప ఎవరిని రానివ్వ వద్దని పెద్దపల్లి డిసిపి బి, రాంరెడ్డి తెలిపారు, మంగళవారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సిబ్బందికి సమావేశం ఏర్పా టు చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చా రు , మూడో విడత ఎన్నికల్లో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మం డలంలోని గ్రామాలలో జరిగానున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్ కు సం బంధించి సమావేశం నిర్వహించారు..
ఇందులో ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రశాం త వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల పనితీరు ఉండా లన్నారు.. పోలింగ్ కేంద్రాల్లో ఒకరి తరువా త ఒకరు ఓటు వేసే విధంగా చూడాలన్నారు... ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధన లకు లోబడి విధులు నిర్వహించాలని ఆదేశించారు... ఎన్నికల సమయంలో సమస్య లు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు...
బుధవారం జరగను న్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 170 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు... ఈ సమావేశంలో ఏసిపి జి, కృష్ణ , సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, లీగల్ సెల్ ఇన్స్పెక్టర్ కృష్ణ , రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్త్స్ర చంద్రకుమార్ తో పాటు పలువురు ఎస్త్స్రలు, పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...