calender_icon.png 17 December, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పచ్చని వాతావరణంలో గ్రీన్ పోలింగ్ కేంద్రం

17-12-2025 05:56:25 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 3వ విడత ఎన్నికలలో భాగంగా జిల్లాలోని అంకుశాపూర్, కోసిని గ్రామ పంచాయతీలలో తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా గ్రీన్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జరిగిన 3వ విడత ఎన్నికలలో భాగంగా అంకుసాపూర్, కోసిని గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన గ్రీన్ పోలింగ్ కేంద్రాన్ని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నీటి కుండలు, సాంప్రదాయ అలంకరణలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అంకుశపూర్ గ్రామ పంచాయతీలో 88 శాతం, కోసిని గ్రామపంచాయతీలో 81 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాల వెల్లడి తరువాత ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు. గ్రీన్ పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి, బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.