calender_icon.png 17 December, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్ ప్రదాత డిఎస్ నకారే..

17-12-2025 05:59:46 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘం భవనంలో విశ్రాంతి ఉద్యోగులు బుధవారం పెన్షన్ సాధన దినాన్ని ఘనంగా జరుపుకున్నారు. డీ ఎస్ నకారే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జాతీయ ఏకీకృత పెన్షన్ సాదనకు కృషి చేసిన డి యస్ నకారె సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. నకారే సుప్రీంకోర్టు కోర్టులో కేసు వెసిచేసిన పోరాటం వల్ల సుప్రీంకోర్టు ఐదుగురి న్యాయమూర్తుల బెనిఫిట్స్ వైవి చంద్రారెడ్డి ధర్మాసనం తేది 17-12-1982 దేశంలోని అన్ని రకాల ఉద్యోగాల కు సమాన పెన్షన్ ఇవ్వాలని తీర్మానించిందన్నారు.

సమాన పెన్షన్ సాదకుడు నకారె అన్నారు. బెల్లంపల్లి స్టిఫ్ఓ కరుణ శ్రీ  ముఖ్య అతిథిగా హాజరైన మా సంఘంలోని సీనియర్  80 సంవత్సరాల దాటిన వారిని శాలువాలు కప్పి సత్కరించారు, STO  కరుణ శ్రీ విశ్రాంతి ఉద్యోగులు సత్కరించారు.  ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి శాఖ అద్యక్షులు యస్ లింగయ్య , కార్యదర్శి. ఇ చంద్రశేఖర్, కోశాధికారి, భోజ రాజయ్య , జిల్లా కౌన్సిలర్లు  సిహెచ్ శంకర్, కే నర్సయ్య,  కార్యవర్గం  సభ్యులు పాల్గొన్నారు.