17-12-2025 06:03:54 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలవల్ల ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అవుషాపూర్ లో నివాసం ఉంటున్న డొంకని మంజుల(42) గత కొంత కాలంగా ఒంటరితనంతో బాధపడుతూ ఆర్థిక సమస్యలు, కొన్ని అనారోగ్యాల సమస్యలు ఉండడం వల్ల మానసికంగా ఆవేదన గురవుతూ గత కొంతకాలంగా బాధపడుతున్నారు. బుధవారం ఉదయం ఇంట్లో అందరూ పడుకుని ఉన్న సమయంలో చీరతో ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నది. కూతురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.