17-12-2025 06:12:14 PM
కోటపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని రాజారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులకు సమానమైన ఓట్లు రాగా ఎన్నికల అధికారులు రీ కౌంటింగ్ ప్రారంభించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి తాటి రాజాగౌడ్ కు 361 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన చేన్నెల్లి వెంకటికి సైతం 361 ఓట్లు వచ్చాయి. ఇద్దరికి సమానమైన ఓట్లు రావడంతో మరోసారి కౌంటింగ్ మొదలు పెట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఇరు పార్టీల మద్ధతుదారులు పెద్ద మొత్తంలో ఎదురు చూస్తున్నారు. రీ కౌంటింగ్ లోనూ సమాన ఓట్లు వస్తే చిత్తు, బొత్తు లేదా లక్కీ డ్రా ద్వారా సర్పంచును ప్రకటించే అవకాశాలున్నాయి.