17-12-2025 12:00:00 AM
గోపాలపేట డిసెంబర్16 : జాతీయస్థాయిలో జరగనున్న ఫుట్బాల్ పోటీలకు గోపాలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థిని ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయులు సురేందర్ రెడ్డి తెలిపారు. జాతీయస్థాయి SGF U/17 విభాగంలో ఈనెల 18 వ తేదీ నుండి 22వ తేదీ వరకు జార్ఖండ్లోని రాంచీ పట్టణంలో జరుగుతున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి అండర్ 17 ఫుట్బాల్ పోటీలలో విద్యార్థిని స్వరూప ఎంపిక కావడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని స్వరూపము అభినందించారు.
నవంబర్ నెలలో నల్గొండ లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో గోల్ కీపర్ గా అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా కల్వకుర్తిలో సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి టౌర్నమెంటులో పాల్గొనడం జరిగింది.
ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లలో మూడుసార్లు పాల్గొనడం జరిగింది.మధ్యప్రదేశ్లో సబ్ జూనియర్ నేషనల్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. కల్వకుర్తిలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలో ఉత్తమ గోల్కీపర్ అవార్డు రావడం జరిగింది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన స్వరూపని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రంగస్వామి, పాఠశాల ఉపాధ్యాయ బృందం. గ్రామ పెద్దలు తల్లిదండ్రులు అభినందించారు.