17-12-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, డిసెంబర్ 16 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో అరట్టు మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. శబరిమలలో సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే ఉత్సవాన్ని ఎల్లారెడ్డి లో కూడా ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ అయ్యప్ప ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాన్ని గాంధీచౌక్, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, దేవునిపల్లి పురవీధుల్లో అయ్యప్ప మాలధార స్వాములు డీజే నృత్యాల మధ్య భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు.
అనంతరం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో అయ్యప్ప మూలవిరాట్ విగ్రహానికి చక్రస్నానం నిర్వహించారు. కార్యక్రమంలో అయ్యప్ప మాలధారస్వాములు చంద్రం గురుస్వామి, శ్రీనివాస్ గురు స్వామి, కృష్ణారెడ్డి గురుస్వామి, రాజేంద్రనాథ్ గురుస్వామి, అమృత్ గురుస్వామి, నగేష్ గురుస్వామి, హరిబాబు గురుస్వామి, రవి గురుస్వామి, ఈశ్వర్ గురుస్వామి, శశి స్వామి, ప్యాలాల రాములు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.