calender_icon.png 14 May, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15న హాజరుకండి

05-07-2024 01:33:30 AM

యెడియూరప్పకు బెంగళూరు కోర్టు సమన్లు

బెంగళూరు, జూలై 4: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్పకు పోక్సో కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 15వ తేదీన తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. సాయం కోసం వచ్చిన ఓ మైనర్ బాలికను యెడియూరప్ప లైంగికంగా వేధించినట్టు పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో గత నెల 27వ తేదీనే కార్ణాటక సీఐడీ పోలీసులు పోక్సో ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొన్న కోర్టు.. 15న తమ ముందు హాజరుకావాలని యెడ్డీకి గురువారం సమన్లు జారీచేసింది. ఈ కేసులో యెడియూరప్పకు కర్ణాటక హైకోర్టు గత నెల 28న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.