9 July, 2026 | 1:28 AM

20 ఏళ్ల కల సాకారం అయింది

09-07-2026 12:35 AM

ఎల్లారెడ్డిలో అభివృద్దే మంత్రంగా పనిచేస్తున్న..

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్‌రావు

తాడ్వాయి, జూలై 8 (విజయక్రాంతి): చిట్యాల ప్రాంత ప్రజలకు 20 ఏళ్ల కల సాకారం అయిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో బుధవారం ఆయన రూ.2.11 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిట్యాల, సంతాయపేట, సోమారం, అన్నారం తండా ప్రజలు లో వోల్టేజి విద్యుత్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇక్కడి ప్రజలు మాకు విద్యుత్ లో వోల్టేజ్ సమస్య ఉందని వెంటనే సమస్య పరిష్కరించాలని కోరగా, తాను వెంటనే విధ్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.2.11 కోట్లు మంజూరు చేశానాన్నారు.ఈ ఉప కేంద్రానికి శంకుస్థాపన నిర్వహించిన ఏడాది వ్యవధిలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి సబు స్టేషస్టేషన్‌ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

తాను ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ తాను అభివృద్దే మంత్రంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. నియోజకవర్గంలో అవసరమైన రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సంతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.

ఇటీవల ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డు ఎర్ర పహాడ్ గ్రామం నుంచి గాంధారి రోడ్డు లింగంపల్లి స్టేజి వరకు రెండు వరసల రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సబ్ స్టేషన్ ప్రారంభంతో ఇక్కడి ప్రజలకు చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి,గృహ అవసరాలకు, వ్యవసాయానికి నాన్యమైన విద్యుత్ అందే అవకాశం ఉందని ఆయన  వివరించారు. అనంతరం ఆయన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు. నందివాడ పెద్ద చెరువు పనులు పరిశీలించారు.

ఎమ్మెల్యే మాటిచ్చాడంటే నిలబెట్టుకుంటాడు..

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు ప్రజలకు మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడని తాడ్వాయి మండల ప్రజలు హర్ష వ్యక్తం చేశారు.చిట్యాలలో సబ్ స్టేషన్ ప్రారంభమనంతరం గ్రామ ప్రజల్లో ఆనందం వెళ్లి మెరిసింది. తమ సమస్యను పరిష్కారం చేయాలని ఎన్నిసార్లు ఎంతమంది ఎమ్మెల్యేలకు చెప్పినా పని జరగలేదని ఒక్కసారి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు చెప్పడంతో పని పూర్తి చేసి పెట్టారని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి సంజీవులు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు జక్కుల రాజిరెడ్డి, సర్పంచ్ రంజిత్ రెడ్డి, సర్పంచులు భాస్కర్ రెడ్డి,సంకపోచయ్య, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు గైని శివాజీ, షౌకత్ అలీ, నాయకులు మద్ది మహేందర్ రెడ్డి, అంబీర్ శ్యామ్ రావు,మేకల రాజు, రాజేశ్వర్ రావు, నవీన్ రెడ్డి, రాజలింగం,మోహన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బాలసాయిలు తదితరులు పాల్గొన్నారు.